Thursday, 5 November 2026

వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు

 

 

 

 

 

బిచ్కుంద మే 14 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో గల
పెద్ద ఏడిగి గ్రామానికి చెందిన జుక్కల్ మండలం ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు అనిల్ కుమార్ వివాహం ఆదివారం రోజు బాన్సువాడలో జరిగింది. ఈ వివాహానికి జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంతరావు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మాజీ జడ్పిటిసి జయ ప్రదీప్, పెద్ద ఎడిగి సర్పంచ్ వినోద్, మైనారిటీ నాయకులు ఇమ్రాన్, యువనాయకులు అరుణ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించారు.