Thursday, 5 November 2026

కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపుకు వినాయక చౌరస్తా వద్ద ఎన్నికల విజయోత్సవ సంబరాలు. యువజన కాంగ్రెస్ నాయకులు

 

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ జనం సాక్షి:– యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో కర్ణాటక ఎన్నికలలో సంపూర్ణ మద్దతు సీట్లను సాధించి అధికారం చెప్పట్టబోతున్న సందర్బంగా భువనగిరి పట్టణంలో వినాయక చౌరస్తా వద్ద టపాసులు కాల్చి స్వీట్లను పంచ్చి సంబరాలు జరుపుకున్నారు.రాబోవు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఇదే తరహాలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేసి బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేసి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించే దాకా కాంగ్రెస్ కార్యకర్తలు నిద్ర పొవ్వదు అని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గాంధీ భవన్ ఆఫీస్ అడ్మిన్ పుట్ట గిరీష్ కుమార్ గౌడ్ జిల్లా అద్యక్షులు బర్రె నరేష్ ,పిసిసి ప్రధాన కార్యదర్శి మున్సిపల్ ప్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్ ఈరపాక నర్సింహ , యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వగాని శ్రీధర్ గౌడ్,అసెంబ్లీ ఉపాద్యక్షులు కొల్లూరి రాజు,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నరముల నవీన్, పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు దర్గాయి దేవేందర్,తదితరులు పాల్గొన్నారు.