జనం సాక్షి, మంథని : కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా భాల్కి నియోజకవర్గంలో రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ భాల్కీ నియోజకవర్గ అభ్యర్థి ఈశ్వర్ ఖాడ్రే కు మద్దతుగా ఏఐసీసీ సెక్రెటరీ, మంథని నియోజకవర్గ శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మంగళవారం పాల్గొని ప్రసంగించారు . కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. అనంతరం భాల్కీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే , టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.




