Tuesday, 3 November 2026

రక్తదానం మరొకరికి ప్రాణదానం – జనచైతన్య ట్రస్ట్

 

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 2 (జనంసాక్షి): రక్తదానం వల్ల మరొకరికి ప్రాణదానం చేయవచ్చునని జన చైతన్య ట్రస్ట్ సభ్యులు అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఒక ప్రయివేట్ హిస్పిటల్ లో ఒక మహిళకు ఓ పాజిటివ్ రక్తం అత్యవసరంగా కావాలి అని అరవింద్ జనచైతన్య ట్రస్ట్ నిర్వాహకులు అయినా పినపారాళ్ళ వంశీ, పారాసాయి, పిల్లిశివశంకర్ లకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన జన చైతన్య ట్రస్ట్ అధ్యక్షుడు పారసాయి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ దుంపల గోపితో మాట్లాడి హాస్పిటల్ వద్దకు పంపించి, కోదాడ లోని తిరుమల బ్లడ్ బ్యాంకు నందు ఓ పాజిటివ్ బ్లడ్ రక్తదానం చేపించడం జరిగింది. ఈ సందర్బంగా ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి మాట్లాడుతూ రక్తదానం అనేది చాలా గొప్ప పని ఎందుకంటే మనం రక్తాన్ని సృష్టించలేం దానం మాత్రమే చేయగలం, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండు, మూడు సార్లు రక్తదానం చేయొచ్చు మీరు చేస్తున్న రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందన్నారు.