Tuesday, 3 November 2026

శుభప్రద్ పటేల్ పేద కుటుంబానికి చేయూత.

ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చిన నిరుపేద తల్లిదండ్రులకు.. శుభప్రద్ పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం.తాండూరు మే 2(జనంసాక్షి)రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన కుర్వ బాలరాజు, మమత దంపతులకు ఇటీవల ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలు జన్మించారు. బాలరాజు దంపతులు నిరుపేదలు కావడంతో కనీసం ఆ పిల్లలకు పాలు కొనే ఆర్థిక స్థోమత లేదు. విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ చలించిపోయారు. వెంటనే తన శుభప్రద్ పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ నిరుపేద కుటుంబానికి చేయూతను అందించారు. ఈ మేరకు శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు బాలు, భానుప్రసాద్, శ్రీశైలం, చందు, విజయ్ హరీశ్.. బాలరాజు ఇంటికి స్వయంగా వెళ్లి.. ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా భవిష్యత్తులోనూ తగిన సహాయ, సహకారాలు అందజేస్తామని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో తమకు కొండంత అండగా నిలిచిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ కు బాలరాజు దంపతులు ధన్యవాదాలు తెలిపారు.