Wednesday, 4 November 2026

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

 

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో నాయకులు శనివారం ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ తో కలిసి రాయచూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు, రొంపికుంట, గొల్లపల్లి, పేరపల్లి గ్రామ సర్పంచ్ లు కటకం రవీందర్, షీలారపు అనిత మల్లయ్య, తొగరి అన్నపూర్ణ అశోక్, బొజ్జ సతీష్ తదితరులు పాల్గొన్నారు.