బచ్చన్నపేట మే 6 (జనం సాక్షి)బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ వద్ద జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ మద్దతు తెలపడం జరిగింది…..ఈ సమ్మె లో ముఖ్య అతిథి గా జనగామ జిల్లా కన్వీనర్ పైస రాజశేఖర్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగంలో చేర్చుకునే అప్పుడే మూడు సంవత్సరాలలో రెగ్యులరైజ్ చేస్తామని వారితో వెట్టిచాకిరి చేయించుకుని గ్రామంలో ఉన్న సౌకర్యాలకు గ్రామంలో జరగాల్సిన పనులన్నింటినీ బాధ్యులుగా చేస్తూ వారికి సరైన వేతనం కూడా ఇవ్వకుండా మూడు సంవత్సరాలు వెట్టి చాకిరి చేయించుకొని మరొక సంవత్సరం ప్రొహిబిషన్ పీరియడ్ ను పెంచి వాళ్లకు తీరని అన్యాయం చేసి ఇప్పుడు ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా స్పందించకుండా వారిని రెగ్యులరైజ్ చేయటం లేదని వారిని రెగ్యులరైజ్ చేయకపోతే మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారు అన్నారు. గ్రామాలలో గ్రామ సంక్షేమం కోసం వెట్టి చాకిరీ చేయించుకుని వారిని కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని ఇన్ని సంవత్సరాలుగా రాత్రి పగలు అని తేడా లేకుండా పనిచేసినటువంటి కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణమని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే గ్రామపంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేసి వారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ పి మండల కో ఇన్చార్జ్ అల్వాల రాజ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు అల్వాల అనిల్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు బొడ్డు నవీన్ మాదిగ నాయకులు దేవరకొండ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు




