Thursday, 5 November 2026

కర్ణాటక విజయంపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..

 

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 13. (జనంసాక్షి). కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంపై హర్ష వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం గాంధీ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు మతోన్మాదానికి చెంపపెట్టుగా ఫలితాలు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీని అక్కునచేర్చుకోవడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఆకునూరి బాలరాజు, నాగుల సత్యనారాయణ గౌడ్, కాముని వనిత, యూసుఫ్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.