కర్నాటకలో గబ్బర్‌ సంగ్‌ పోలీసులు

బెంగళూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): తాము విధి నిర్వహణలో ఉన్నామన్న విషయాన్ని పోలీసులు మరిచిపోయి.. డ్యాన్స్‌ మాస్టర్లలా ప్రవర్తించారు. ఓ కేసులో స్టేషన్‌కు వచ్చిన నిందితుడిని పోలీసులు వేధించారు. ఈ సంఘటన కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన గబ్బర్‌సింగ్‌లోని ఓ పాటకు డ్యాన్స్‌ చేయాలని నిందితుడిపై ఒత్తిడి చేశారు. ఆ పాటను వింటూ ఓ పోలీసైతే.. హుషారుగా స్టెప్పులేశాడు. చేతిలో కట్టె పట్టుకొని నిందితుడిని బెదిరిస్తూ డ్యాన్స్‌ చేయమని ర్యాగింగ్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది. అయితే పోలీసు ఉన్నతాధికారులు ఈ వీడియో స్పందించి విచారణకు ఆదేశించారు. నిందితుడిని డ్యాన్స్‌ చేయమని ఒత్తిడి చేసిన హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు.