కర్నూలు కలెక్టరేట్‌ ముందు వైద్యుల నిరసన

కర్నూలు,జూలై28(జ‌నం సాక్షి): కర్నూలు కలెక్టరేట్‌ ముందు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వైద్యులు శనివారం నిరసన చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్‌ఎమ్‌సి బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేంద్ర కమిటి ఇచ్చిన పిలుపు మేరకు ప్రయివేటు ఆసుపత్రుల బంద్‌ కార్యక్రమంలో భాగంగా ఈ నిరసన నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ప్రయివేట్‌ ఆస్పత్రుల బంద్‌ శనివారం కొనసాగుతోంది.

 

తాజావార్తలు