– విద్యార్ధినిపై కత్తితో దాడికి దిగిన ఉపాధ్యాయుడు
– గొంతుకోసి, తాను ఆత్మహత్యకు యత్నం
– చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన స్థానికులు
– విద్యార్ధిని పరిస్థితి విషమం
– ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి గంటా
– విద్యార్ధినికి మెరుగైన వైద్యం అందించాలని సూచన
కర్నూల్, నవంబర్3(జనంసాక్షి) : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ దారితప్పాడు. తనను ప్రేమించాలని బాలికను వేధించడం మొదలుపెట్టాడు. అయితే సదరు యువతి అందుకు అంగీకరించకపోవడంతో రెచ్చిపోయిన టీచర్ శనివారం బాధితురాలి ఇంటికి వెళ్లి గొంతును కోసేశాడు. అనంతరం తానూ ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బంగారుపేటలో చోటుచేసుకుంది.. కాగా ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా విద్యార్ధినిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే, పెడదోవ పట్టాడు. ప్రేమపేరుతో తొమ్మిదో తరగతి విద్యార్థినిని వేధించి, ఇందుకు అమె అంగీకరించకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. శనివారం ఉదయం బాలిక ఇంటికి వెళ్లిన ఉపాధ్యాయుడు ఆమె గొంతుకోశాడు. దారుణమైన ఈ ఘటన కర్నూలు నగరంలోని బంగారుపేటలో చోటుచేసుకుంది. శంకర్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ పద్దతిలో హింది ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో
9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల ప్రేమ పేరుతో వెంటపడేవాడు. కాగా విద్యార్ధిని ఎంతకీ ప్రేమను అంగీకరించలేదు. కాగా గత నాలుగు రోజులుగా శంకర్ పాఠశాలకు వెళ్లకుండా విద్యార్ధిని ఇంటి పరిసరాల్లో తిరిగినా విద్యార్ధిని పట్టించుకోకపోవటంతో విద్యార్ధిని పట్ల మరింత ఆగ్రహం పెంచుకున్న శంకర్.. శనివారం విద్యార్ధిని తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటిలోకి వెళ్లాడు. మద్యం మత్తులో కత్తిని తన వెంట తీసుకెళ్లిన శంకర్ తనను ప్రేమించాలని విద్యార్ధినిని భయబ్రాంతులకు గురిచేశాడు. అయినా విద్యార్ధినిని తనకు ఇష్టం లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన శంకర్ విద్యార్ధిని మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో విద్యార్ధిని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి ఉపాధ్యాయుడు శంకర్‌ను పట్టుకొని దేహశుద్ది చేశారు. కాగా ఉపాధ్యాయుడు కత్తిదాడితో గాయపడ్డ విద్యార్ధినిని ఆస్పత్రికి తరలించారు. కాగా మద్యం మత్తులో ఉన్న శంకర్ తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో శంకర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న
పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తీవ్రంగా స్పందించారు. ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని, దాడిలో గాయపడ్డ విద్యార్ధినికి మెరుగైన చికిత్స అందించాలని గంటా అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి విచారణజరిపి తనకు నివేదిక అందించాలని సూచించారు.
కర్నూల్ జిల్లాలో దారుణం..కర్నూల్ జిల్లాలో దారుణం..




