కలకలం రేపుతున్న కొండముచ్చుకు భయపడుతున్న గ్రామస్తులు.
నేరడిగొండడిసెంబర్20(జనంసాక్షి):మండలంలోని బోథ్ ఎక్స్ రోడ్డు నుండి వాగ్దరి గ్రామానికి వెళ్లే రహదారికి అటవీ ప్రాంతంలో కొండముచ్చు కల కలం రేపుతోంది అటువైపు వెళ్ళాలంటేనే జనం భయాందోళనకు గురవుతున్నారు.గత15 రోజుల నుండి బైక్ పై వెళ్తున్న దాదాపు పది వ్యక్తులపై దూకి దాడి చేసి గాయపరిచాయి. దాంతో వాగ్దారి వెంకటాపుర్ మాదాపూర్ తోపాటు పలు గ్రామస్తులు అటువైపు రాకపోకలు జరుపాలంటేనే జంకుతున్నారు.మంగళవారం కూడా స్థానిక సాయి చైతన్య డిగ్రీ కలశాల అధ్యాపకుడు ఎక్స్ రోడ్డు నుండి వాగ్దారి గ్రామం వైపు బైక్ పై వెళ్తున్న క్రమంలో చెట్టు పై నుంచి ఆయనపై దూకి గాయపరచిన సంఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.అటవీ శాఖ అధికారులు స్పందించి సమస్యను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కలకలం రేపుతున్న కొండముచ్చుకు భయపడుతున్న గ్రామస్తులు




