గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకే క్రీడా మైదానాలు ఏర్పాటు
జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఆశిస్ సంగ్వాన్
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (20) గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కార్ క్రీడ మైదానాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఆశిస్ సంగ్వాన్ అన్నారుమంగళవారం ఆయన మండలంలోని పోలికపాడు గ్రామంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, క్రీడా ప్రాంగణం, హెల్త్ సెంటర్, నర్సరీలను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడకు విద్యార్థులకు ఉపయోగకరమైన సూక్తులు రాయించాలని పాఠశాల ప్రహరీ గోడ ముఖ ద్వారం వద్ద పాఠశాల సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు క్లాస్ రూమ్ లో విద్యార్థులతో ముచ్చటించే ఆయన పలు అంశాలపై ప్రశ్నలు వేసి విద్యార్థులచే జవాబులు రాబట్టారు విద్యార్థుల ప్రతిభ పట్ల సంతోషం వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు అనంతరం ఆయన హై స్కూల్ లోని క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. క్రీడా మైదానాలను సద్వినియోగం చేసుకోవాలనివిద్యార్థులకు ఆయా క్రీడలపై శిక్షణ ఇవ్వాలన్నారు. మన ఊరు మనబడి లో భాగంగా నిర్మించ తలపెట్టిన పాఠశాల డైనింగ్ హాల్ త్వరగా పూర్తి చేయాలి అన్నారు నర్సరీని పరిశీలించిన నర్సరీ నిర్వహణ పనులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మంద భార్గవి, సర్పంచ్ వర్నే రజిని, ఉపసర్పంచ్ అశోక్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఎంపీడీవో హుస్సేనప్ప, పి ఆర్ డి ఈ అశోక్, ఎంపీ ఓ నరేందర్, కాంప్లెక్స్ హెచ్ఎం రాజశేఖర్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం విజయ్ కుమార్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి జానకి, తదితరులు పాల్గొన్నారు




