Thursday, 5 November 2026

క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు

 

రాజంపేట్ మార్చి 14 (జనంసాక్షి)

రాజంపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం క్షయ వ్యాధిపై వ్యాధిపై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సూపర్వైజర్ మంజూరు, గంగమని పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… గత 5 సంవత్సరాల టీ బి చరిత్ర కలిగిన వారిని , గతంలో కోవిడ్ వచ్చిన వారిని, డయాబెటిస్ తో బాధపడుతున్న వారిని, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారిని టీ బి లక్షణాల గురించి వారికి సింటమ్స్ ఎగ్జామినేషన్ చేయించాలని అవగాహన కల్పించడం జరిగింది.
టీ బి మందులు తింటున్న వారికి అందుతున్న బెనిఫిట్ లు గురించి వివరించడం జరిగింది .
అలాగే టీ బి ఛాంపియన్ తో కూడా అవగాహన ఏర్పటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్య క్రమంలో టిబి సూపర్వైజర్ శ్యామ్ కుమార్,
ఐకేపీ మెంబర్లు, ఎం ఎల్ హెచ్ పి ఎస్ ఫరీదా ఏఎన్ఎం చందబిబి, నాగలక్ష్మి, ఆశావర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.