Thursday, 5 November 2026

కలకోవ గ్రామంలో ముగిసిన నాభి శిల బొడ్రాయి ఉత్సవాలు

కలకోవ గ్రామంలో ముగిసిన నాభి శిల బొడ్రాయి ఉత్సవాలు

 

మునగాల, నవంబర్ 22(జనంసాక్షి): కలకోవ గ్రామంలో నాభి శిల బొడ్రాయి కనకదుర్గమ్మ ముత్యాలమ్మ గ్రామ దేవతల మూడో వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా మంగళవారంతో ముగిశాయి. గ్రామ మహిళలు అమ్మవార్లకు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించినారు. గ్రామంలో ప్రభ బండ్లు పురవీధుల గుండా అమ్మవారి సన్నిధి చేరుకున్నాయి. గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మూడవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసినారు. కలకోవ గ్రామ సర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబు, ఎంపీటీసీ గన్నా భవాని నరసింహారావు, దేవాలయ చైర్మన్ జూకూరి అంజయ్య, గ్రామ పెద్దలు పనస వీరయ్య, మండవ చిన్నసైదులు, అనంత శ్రీనివాస్, దొంతగాని రవి బాబు, తిప్పని వీరయ్య, పనస శ్రీనివాస్, దొంతగాని లింగయ్య, బచ్చు శ్రీనివాస్, చిర్రా శ్రీనివాస్, మునగలేటి తిరపయ్య, కుడుముల వీరయ్య, మునగలేటి వీరబాబు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు