రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎంపీ ఉత్తమ్
మునగాల, నవంబర్ 22(జనంసాక్షి): మునగాల మండల శివారులో ఈనెల 12వ తారీఖున రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మునగాల మండల కేంద్రంలోని సోమవారం రాత్రి రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించి జాతీయ రహదారి అధారిటీ, జిఎంఆర్ అధికారులతో చరవాణిలో మాట్లాడుతూ, ఇటీవల మునగాల మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి అధికారులకు వివరించి రోడ్డు ఇరువైపులా సర్వీస్ రోడ్లను నిర్మించాలని ఆయన కోరారు. సర్వీస్ రోడ్డు నిర్మించాలంటే ముస్లింలకు సంబంధించిన సమాధులు ఉండటం వలన వర్ఫ్ బోర్డు అధికారులు పరిమిషన్ ఇవ్వడం లేదని వర్ఫ్ బోర్డుకి సంబంధించిన అధికారులు రోడ్లు నిర్మించుటకు ఆదేశాలు ఇచ్చినట్లయితే వెంటనే సర్వీసు రోడ్ల నిర్మాణ పనులను చేపడుతామని వారు హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ తరఫున ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ను చరవాణి ద్వారా కోరారు. ఇట్టి విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలిశెట్టి బుచ్చిపాపయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బచ్చు అశోక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు ఎలక నరేందర్ రెడ్డి కాసర్ల కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పుల జానకి, కాలే సామేల్, పాలపాటి ప్రవీణ్ కుమార్, అమరబోయిన మట్టయ్య, ఎండి రషీద్, భీమపంగు శంకర్, నర్రా నవీన్ రెడ్డి, జిల్లెపల్లి శ్రీను, వెంకటేశ్వర్లు, గంగుల హరిబాబు, కాసర్ల వెంకట్, చింతకాయల శ్రీను, సోమపంగు బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు.




