Thursday, 5 November 2026

ప్రమాద స్థలంలో బీసీ నాయకుడి తక్షణ స్పందన. ఆసుపత్రికి హుటాహుటిన బాధితురాలి తరలింపు.

ప్రమాద స్థలంలో బీసీ నాయకుడి తక్షణ స్పందన. ఆసుపత్రికి హుటాహుటిన బాధితురాలి తరలింపు..
దామెర మండలం
నవంబర్ 22(జనం సాక్షి )

హనుమకొండ జిల్లా దామెర మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కేర్ ఫార్మసీ కాలేజీ ఎదురుగా బైక్ ( TS 28 M2000) పై నుండి సుధ అనే యువతి అకస్మాత్తుగా కిందపడి స్పృహ కోల్పోయిన తరుణంలో అప్పుడే పరకాలలో ఒక పబ్లిక్ సమావేశానికి హాజరయ్యి వరంగల్ కు తిరిగి వస్తున్న బీసీ రాజ్యాధికార సమితి నాయకులు దాసు సురేశ్ హుటాహుటిన అంబులెన్సు , పోలీసు వారికి సమాచారం అందజేసి మొబైల్ ద్వారా డాక్టర్ సహాయం తీసుకొని స్థానికుల సహాయంతో సుధకు ప్రధమ చికిత్స అందజేయడం జరిగింది .. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సై హరి ప్రియ సహాయంతో బాధితురాలిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించడం జరిగింది.. ప్రమాద గ్రస్థురాలు సుధ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని దాసు సురేశ్ తెలియజేసారు.. అంబులెన్సు రావడానికి అరగంట పట్టిందని ,108 సేవలలో వేగం పెంచాలని ప్రభుత్వానికి దాసు సురేశ్ విజ్ఞప్తి చేశారు..