Thursday, 5 November 2026

విద్యార్థులకు షూస్ పంపిణీ

విద్యార్థులకు షూస్ పంపిణీ

ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 5 (జనంసాక్షి) పల్లెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకి హైదరాబాద్ లయన్స్ క్లబ్ కి చెందిన దాత దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ విద్యార్థులకు షూస్ అందజేశారు ఈ సందర్బంగా లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ క్రమ శిక్షణతో కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు గౌడకంఠమ్ ఎడిటర్ నోముల సిద్దూ గౌడ్ ఈ విషయాన్నీ తన దృష్టికి తీసుకొస్తే స్పందించి ఈ ఊరికి వచ్చి అందజేశామని చెప్పారు అనంతరం గౌడ కంఠమ్ ఎడిటర్ నోముల సిద్దూ గౌడ్ మాట్లాడుతూ తాను చదివిన స్కూల్ కి గతంలో ఇన్వెర్టర్ మైక్ సెట్ ఇచ్చాను తన ఆత్మీయులు లక్ష్మీ నారాయణ గౌడ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు స్కూల్ అభివృద్ధికి మరింత సహకారం అందిస్తానని అన్నారు ప్రధానోపాధ్యాయులు స్వామి మాట్లాడుతూ దాతలు అందించే సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు అశోక్ గౌడ్ జనార్దన్ రెడ్డి కరుణాకర్ దేవేందర్ చారి రాంచందర్ ఉపాధ్యాయులు వెంకటనర్సయ్య భాస్కర్ రెడ్డి షమీమ్ ఖలీమ్ లక్ష్మణ్ రవీందర్ విజయ తదితరులు పాల్గొన్నారు