Wednesday, 4 November 2026

కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేయండి

కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేయండి.కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేయండి.
డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 3. (జనంసాక్షి) రుణమాఫీ చేయాలని ధరణి పోర్టల్  రద్దు చేయాలని కోరుతూ రైతుల సమస్యలపై డిసెంబర్ 5న జరిగే కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ కోరారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి తీరని ద్రోహం చేస్తుందని అన్నారు. రైతుల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఏళ్లు గడిచిన అమలకు చేయకపోవడంపై మండిపడ్డారు. ధరణి పోర్టల్ పెద్ద కుట్రని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోడు రైతులకు హాక్కుపత్రాలు ఇచ్చిందని అన్నారు. తక్షణమే పోడు రైతులలపై వేధింపులు ఆపాలని న్యాయంగా వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 5న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టడం జరిగిందని అన్నారు. ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు హాజరుకానునట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు టోనీ, చొప్పదండి ప్రకాష్, వెంగల అశోక్ తదితరులు పాల్గొన్నారు