Thursday, 5 November 2026

కలెక్టర్ కు వినతులు

కలెక్టర్ కు వినతులు
రాజోలి 12జనవరి(జనం సాక్షి)
మండలం లో పర్యటించిన కలెక్టర్ వల్లూరు క్రాంతి కి ప్రజల నుండి వినతులు వెల్లువెత్తాయి. రాజోలి లో వైకుంఠ నారాయణ స్వామి ఆలయం అన్యాక్రాంతం అయ్యిందని, స్థానిక జిల్లా పరిషత్ పాటశాల లో మరుగు దొడ్లు లేవని, స్థానిక శ్రీ రామ్ సేవా సమితి సభ్యులు వినతిపత్రాన్ని అంద చేశారు. పెద్ద తాండ్ర పాడు గ్రామంలో తమకు గతంలో ప్రభుత్వం నుండి అందించిన ప్లాట్లను ఇంకా లబ్ధిదారులకు కేటాయింపు చేయలేదని, అందులో గుంతలు ఉంటే చదును చేసుకున్నామని,అధికారులు .మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. మన ఊరు మన బడి లో భాగంగా పాఠశాల లో భవనం కు సంబంధించిన పనులు చేస్తే 6 లక్షల రూపాయల దాకా బిల్లులు పెండింగులో ఉన్నాయని వాటిని చెల్లించాలని గ్రామానికి చెందిన దానియేలు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు. అశోక్ నగర్ క్యాంపు వద్ద ఆర్డీఎస్ రైతులు తమకు నీరు సక్రమంగా సాగు నీరు అందటం లేదని , అసరా ఫింక్షన్ రావడం లేదని ఆమెకు తెలిపారు. కింది డిస్ట్రిబ్యూటర్ లకు నీటిని అందిస్తున్నామని చెప్తున్న అధికారులు తమకు పూర్తి స్థాయిలో నీటిని అందించలేక్ పోతున్నారని,ధీంతో మొక్కజొన్న, మిరప పంటలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నామని తెలపగా అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.