జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీలు హుజూర్ నగర్ జనవరి 12 (జనంసాక్షి): జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజూర్ నగర్ పోలీస్ వారు ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో కబడ్డీ పోటీలను సీఐ రామలింగారెడ్డి, ఎస్సై కట్టా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం 8 పాఠశాలల టీంలు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్ గౌట్ హైస్కూల్, సోషల్ వెల్ఫేర్ స్కూల్ లు మ్యాచ్ ఆడగా అందులో సోషల్ వెల్ఫేర్ స్కూల్ విజయం సాధించడం జరిగిందన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల యాజమాన్యం, పిఈటీలు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీలు




