కలెక్టర్ ను సన్మానించిన టీయూడబ్ల్యూజే నాయకులు.
-జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ తో చర్చించిన యూనియన్ నాయకులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జనవరి6(జనంసాక్షి):
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ను కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టికి తీసుకు వెళ్ళారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు కొండకింది మాధవరెడ్డి,కృష్ణయ్య లు మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రెండు పడక గదుల నిర్మాణాలను పూర్తి చేసి వెంటనే పంపిణీ చేయాలని కోరారు.జర్నలిస్టులకు పంపిణీ చేసిన హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రులలో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గొడుగు సహదేవుడు, శేఖర్, వల్లభ శ్రీను, దశరథం, శేఖర్, పూరి నరేష్, సహదేవుడు గౌడు, నాగరాజు, వెంకట స్వామి, చెన్నకేశవులు, కరుణాకర్,వెంకటేష్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.




