ప్రతి గల్లీలో సిసి రోడ్డు నిర్మాణం చేపడతాం.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్: కాగజ్ నగర్ రూరల్:06 జనవరి (జనం సాక్షి) కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడ వార్డ్ నెంబర్ 6 లో గల అర్ అర్ ఓ క్యాంప్ లోని కస్తూర్బా పాఠశాల మరియు వ్యవసాయ గోదాముల ప్రధాన రహదారికి సీసీ రోడ్డుకు 42 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కసం శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్ కుమార్,స్థానిక వార్డ్ కౌన్సిలర్ పీర్సింగుల జై చందర్, రైస్ మిల్లర్ల అధ్యక్షులు చిలువేరు సత్యనారాయణ, వ్యాపారులు, బీ.ఆర్.ఎస్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు




