Thursday, 5 November 2026

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్ సురేందర్ నాయక్

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్ సురేందర్ నాయక్

టేకులపల్లి,డిసెంబర్ 16 (జనం సాక్షి): ఇల్లందుఎమ్మెల్యే భానోత్ హరి ప్రియ క్యాంప్ కార్యాలయం లో టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు గ్రామపంచాయతీ కి చెందిన మాలోతు బుజ్జి హరిదాస్( కోకిల),ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ గారు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని అభివృధి పనులు, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ఎన్నో కార్యక్రమలు చేస్తున్నారని ధారావతుధాని బిక్కు ( లలిత) లకు కళ్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక సర్పంచ్ మాలోత్ సురేందర్ నాయక్ చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల తల్లిదండ్రులకు కళ్యాణ మహోత్సవ సమయంలో కళ్యాణ లక్ష్మి చెక్కు లను అందజేసి భరోసానిస్తున్నారని అన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులన్నీ కోట్ల రూపాయలను వెచ్చించి విద్య, వైద్యం, రహదారులు అభివృద్ధి పనులను ముమ్మరంగా చేపడుతున్నారని, రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు.