Thursday, 5 November 2026

ముదిరాజ్ లను రాజకీయంగా గుర్తించిన నాయకులు జంగం గోపి

ముదిరాజ్ లను రాజకీయంగా గుర్తించిన నాయకులు జంగం గోపి
జహీరాబాద్ డిసెంబర్ 16 (జనం సాక్షి) నియోజకవర్గంలో ముదిరాజ్ కులంలో నాయకులు లేరని గ్రహించిన బీజేపీ నేత జంగం గోపి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నాయకులను రాజకీయంగా గుర్తించిన నాయకులు జంగం గోపి అని జహీరాబాద్ నియోజకవర్గ ముదిరాజ్ నాయకులు అన్నారు. శుక్రవారం విలేకరులతో వారు మాట్లాడుతూ జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే బాగన్న ఉన్నప్పుడు మాత్రమే ముదిరాజ్ కులంలో నాయకులకు గుర్తింపు ఉండేదన్నారు. ఆయన పదవి కాలం ముగిసిన నుండి ఇప్పటి వరకు మా కులంలో నాయకులు పట్టించుకోకుండా ఉన్నారన్నారు, నియోజకవర్గంలో అది గుర్తించిన జంగం గోపి మా ముదిరాజ్ కులంలో నాయకులను తయారు చేస్తున్నారని ఇప్పటివరకు ఏ పార్టిగాని ఏ నాయకులుగాని మా ముదిరాజ్ లను గుర్తించలేరని, అది గమనించిన బీజేపీ నేత జంగం గోపి మమ్మల్ని బలమైన నాయకులను తయారు చేస్తున్నారని దానికి అనుగుణంగానే ఆయా మండలాల్లో బీజేవైఎం మండలం అధ్యక్షులుగా చేసి చూపించారాని అన్నారు. నియోజకవర్గంలో జంగం గోపిని 100%గెలిపించుకుంటామని ముదిరాజ్ కులానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్న నాయకున్ని గుండెల్లో పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బీజేపీ మండల మాజీ అధ్యక్షులు మలకాడి శేఖర్.జహీరాబాద్ బిజెవైఎం మండల అధ్యక్షులు గిరబోయిని రవి,ఝరాసంగం బిజెవైఎం మండల అధ్యక్షులు బంటు విశ్వనాథ్. కొహీర్ బిజెవైఎం మండల అధ్యక్షులు దిడిగి రాములు కోహీర్ మండల ఓబీసీ మండల అధ్యక్షులు బంటు రాజు తదితరులు పాల్గొన్నారు.