Tuesday, 3 November 2026

కల్లాలు ఓపెన్ చేసిర్రు.. కాంటలు బందు పెట్టిండ్రు.. ! – షరతులు లేకుండా రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి – టిడిపి మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ మాదాడి శ్రీనివాస్ రెడ్డి

 

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : మంథని నియోజకవర్గంలో ఇప్పటికీ 20 నుంచి 25 రోజులు అవుతుంది ప్రతి మార్కెట్లో వడ్లు రైతులు దాన్యం తీసుకువచ్చి కానీ ఇప్పటివరకు ఏ ఒక్క మార్కెట్లో కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అధికార పార్టీ నాయకులు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు గానీ, ఇతర ప్రజాప్రతినిధులు గానీ నూతనంగా నిర్మించినటువంటి సచివాలయ మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద పెట్టరా..? అని తెలుగుదేశం పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జ్ మాదాడి శ్రీనివాస్ రెడ్డి అని ప్రశ్నించారు. మంగళవారం మంథనిలోని శ్రీపాద కాలనీ, గంగపురి, కాకర్ల పల్లె సూరయ్య పల్లె ఖానాపూర్ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. మంథని నియోజకవర్గంలో అన్ని గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి లేని పక్షంలో రైతులు అందరిని ఏకం చేసి నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వడ్లను తూర్పాల పడితేనే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వారు అన్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దపెల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెండ రాజయ్య, మండల పార్టీ అధ్యక్షులు మేదరవైన ఓదెలు, తెలుగు యువత నాయకులు బడుగు మహేష్ , మహిళా నాయకురాలు మెండ లక్ష్మి శ్రీనివాస్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.