జనం సాక్షి దుబ్బాకకల్లుగీత కార్మికుల బతుకులకు భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని గౌడ జన హక్కుల పోరాట సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు వన్నెల రవిగౌడ్ హర్షం వ్యక్తం చేసారు.రైతుబీమా తరహాలోనే గీతకార్మికుల బీమాను ప్రకటించడం హర్షించ దగ్గ విషయం అన్నారు.ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారని తెలిపారు . ఈ మేరకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో బీమా రావాలంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతోపాటు సాక్షులు, డెత్ సర్టిఫికెట్, ఇతర పేపర్ వర్క్ కావడానికే నెలలు గడిచిపోయేవని, బీమా చెక్కు వచ్చేందుకు ఏండ్లు అయ్యేదన్నారు. అలాంటి కష్టాలు ఎవరూ పడొద్దనే ఉద్దేశంతో వారంలోనే బీమా డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవడం గొప్ప విషయం అన్నారు




