Tuesday, 3 November 2026

ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడంలో గాని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో అందరితోపాటు ముస్లిం మైనార్టీలు కూడా ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముస్లిం మైనారిటీ లు విద్యార్థులు సైతం తమ ఆత్మ బలిదానాలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అలాగే భువనగిరి పట్టణానికి చెందిన సయ్యద్ మహబూబ్ అనే వ్యక్తి తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడని గుర్తు అన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ నాయకులు జావిద్ ఖాద్రి ఖాజా అజీమోద్దీన్ సయ్యద్ అఫ్జల్ సామాజిక వేత్త బట్టు రాంచంద్రయ్య రఘుబాబు ఎండీ ఆబేద్,ఎండీ హమీద్ పాషా ఎండీ సలవొద్దీన్ ఎండీ కాజమ్ ఎండీ ఇస్మాయిల్ ఎండీ ఎండీ వసీమ్ ఎండీ ఇంతియాజ్ ఎండీ అఫ్రోజ్ ఎండీ బురాన్ ఎండీ ఉస్మాన్
తదితరులు పాల్గొన్నారు.