Friday, 6 November 2026

కల్లూర్కు అదనపు బస్సు సర్వీసులు నడపాలని నిరసన

కల్లూర్కు అదనపు బస్సు సర్వీసులు నడపాలని నిరసన.

కోటగిరి డిసెంబర్ 27 జనం సాక్షి:-ఉమ్మడి కోటగిరి మండలంలోనీ కల్లూర్ గ్రామ ప్రజలు మంగళవారం రోజున బోధన్ ఆర్టీసీ బస్సును అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.వివరాలలోకి వెళ్లితే కల్లూర్ గ్రామానికి సమయానకూలంగా బస్సులు రాకపోవడంతో కాలేజీ స్కూల్ విద్యార్థులకు ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని,అలాగే ఉదయం,సాయంత్రం వేళలో బస్ సర్వీసులతో పాటుగా సాయంత్రం నాలుగున్నర గంటలకు జల్లాపల్లి గ్రామానికి వచ్చే బస్సుని,కల్లూరు వరకు నడపాలని ఆర్టీసీ అధికారులకు గ్రామస్థులు డిమాండ్ చేస్తూ మంగళవారం రోజున గ్రామస్థులు గ్రామంలోకి వచ్చిన ఆర్టీసి బస్సును నిలిపివేసి తమ ఆగ్రహన్నీ,నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ తో బోధన్ డిపో మేనేజర్ స్పందించి మాట్లాడుతూ.సకాలంలో కల్లూరు గ్రామానికి బస్సు రాకపోకలు ఉంటాయని,అలాగే జల్లాపల్లి గ్రామానికి వచ్చే బస్సు ను కల్లూర్ వరకు పంపే ప్రయత్నాలు చేస్తామని అన్నారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ వాగ్దానానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ నిరసనను విరమింపచేశారు.డిపో మేనేజర్ తమ హామీని నిలబెట్టుకోలేని పక్షంలో మరల సోమవారం నుండి గ్రామస్తులమందరం బస్సులను నిలిపివేసి నిరసనలు తెలియజేస్తామన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు,గ్రామస్తులు పాల్గొన్నారు.