పేదలకు పనులు చేసి, పంచే ప్రభుత్వం బి ఆర్ ఎస్
జహీరాబాద్ డిసెంబర్ 27( జనం సాక్షి)పేదలకు పనులు చేసి, పంచే ప్రభుత్వం, అభివృద్ధి సం క్షేమం తో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం బి ఆర్ ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం.జహీరాబాద్ నియోజకవర్గం లో రూ.97 కోట్లతో 10 ఆర్ అండ్ బి,మరియు 45 పంచాయతీరాజ్ రహదారుల ప్రత్యేక మరమ్మత్తులకు మంత్రి హరీష్ రావు మంగళవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణంలో రూ. 10 కోట్లతో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను మంత్రి ప్రారంభించారు. పట్టణంలో మినీ హజ్ హౌస్ నిర్మాణానికి,హోతి (కె) గ్రామంలో షాధిఖాన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పద్మశాలి సంఘం,ముదిరాజ్, ఆరె కటిక, ఆర్య వైశ్య,నాయి బ్రాహ్మణ,పూసల, రజక,స్వర్ణ కారుల,కురుమయాదవ,అంబేడ్కర్,బాబు జగ్జీవన్ రామ్,హరిజన ,బంజారా సంఘం భవనాలకు సంబంధించి మంజూరీ
ఉత్తర్వులను ఆయా కుల పెద్దలకు అందించారు.జహీరాబాద్ పట్టణం రహామత్ నగర్ లో రూ.19.25 కోట్లతో నిర్మించిన 312 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి ప్రారంభించారు.13 బ్లాక్ లలో బ్లాక్ కు 24 ఇండ్లను నిర్మించారు.లబ్ధిదారులకు ఇంటి సాంక్షన్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. లబ్ధిదారుల తో గృహ ప్రవేశాలు చేయించి, స్వీట్స్ తినిపించారు. ఇక్కడ ఇండ్ల వారికి ఎక్కడికీ వెళ్ళకుండా రెండు మూడు నెలల్లో ఒక రేషన్ షాపు,అంగన్ వాడి కేంద్రం,బస్తీ దవాఖానా
ఏ ర్పాటు చేస్తాం అన్నారు
హో తి (కె) లో నిర్మిస్తున్న 700 ఇండ్లు త్వరలో పూర్తి కావస్తున్నవి.రానున్న రెండు మూడు నెలల్లో అర్హులైన పేదలకు ఇస్తాం అన్నారు.స్వంత జాగావున్న వెయ్యి మందికి ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాం అన్నారు.మెప్మా ఆధ్వర్యంలో 150 స్వయం సహాయక సంఘాలకు రూ.15.82 కోట్ల చెక్కును మంత్రి అందజేశారు
రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాలకు నియామకాలు జరుగుతున్నవి అన్నారు.950 మంది డాక్టర్లను నియమిస్తున్నాం అని తెలిపారు
పేదలకు పన్నులు వేసే పని బీజేపీది అన్నారు.ప్రజలు ఆలోచించాలి
జహీరాబాద్ నియోజక వర్గం మరింత అభివృద్ధి చేస్తాం అన్నారు
రాబోయే రోజుల్లో కాళేశ్వరం నీటినితెచ్చి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తాం. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణి క్ రావు ఎంపీ బీబీ పాటిల్ ,డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సిడిసి చైర్మన్ ఉమకాంత్ పాటిల్,జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్, రాష్ట్ర నాయకులు తన్వీర్ నాయకులు నామరవికిరణ్, బాబీ, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహ గౌడ్, గోటిగర్ పల్లి భూమయ్య,వెంకటేశం, అనంత్ నవీన్ కుమార్,ప్రజా పత్రినిధులు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు పనులు చేసి, పంచే ప్రభుత్వం బి ఆర్ ఎస్




