Thursday, 5 November 2026

కల్వచర్ల గ్రామ సర్పంచ్ ను సన్మానించిన భవన నిర్మాణ తాపీ మేస్త్రీలు

 

 

 

 

జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ సర్పంచ్ గంట పద్మ వెంకట రమణ రెడ్డి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు వచ్చిన సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి ఎస్కే షరీఫ్ ఆధ్వర్యంలో శనివారం భవన నిర్మాణ కార్మికుల కార్యాలయంలో సర్పంచ్ గంటా పద్మా వెంకటరమణ రెడ్డి, ఉప సర్పంచ్ కనకయ్య ను చిలువేరు స్వామి ఎస్కే షరీఫ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కల్వచర్ల గ్రామ అధ్యక్షులు ఎస్కే షరీఫ్, రత్నాపూర్ పన్నూరు అధ్యక్షులు బైరి శంకర్, కొయ్యడ సంపత్ మండల్ జనరల్ సెక్రెటరీ కుసుమ సురేష్, వెంగళ రాములు, పెరుమళ్ళ సమ్మయ్య, ఎల్లా వెంకటేష్ , రాములు, అంజయ్య, రాయమల్లు, విష్ణువర్ధన్, సారయ్య, తిరుపతి, రోశయ్య, సంతోష్ , భాస్కర్ , రాజయ్య, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.