Thursday, 5 November 2026

మల్లికార్జున ఖర్గే ను కలిసిన యూనియన్ బృందం.మంచిర్యాల సత్యాగ్రహ సభకు విచ్చేసిన ఏఐసీసీ అధ్యక్షులు యూనియన్ శ్రేణులు పలు విషయాలను చర్చించారు.

 

 

 

 

సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వములో కలిసిన ఫిబ్రవరి 2022 న న్యూ ఢిల్లీలోని తల్కతోర స్టేడియం లో ఏర్పాటు చేసిన యూనియన్ ప్లీనరీ కి మీరు హాజరు అయినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి హాజరు ఐఎన్ టీయుసి ప్రతిష్ఠను గణనీయంగా పెంచింది అని మా ప్రియమైన నాయకుడు డాక్టర్ సంజీవరెడ్డి కార్మిక మంత్రిగా మీ సేవలో ఎప్పుడు గుర్తు చేస్తుంటారు అనకోర్టు పరిధిలో ఉన్న యూనియన్ వివాదం పట్ల శ్రీమతి సోనియా గాంధీ సూచన మేరకు మీరు దిగ్విజయ్ సింగ్ త్వరితగితన సమస్యను పరిష్కరించి జేబీసీసీఐ -11లో సంజీవరెడ్డి నాయకత్వములోని యూనియన్ ని చేర్చడంలో మీ పాత్ర మరువలేనిదని తెలియ చేస్తూ,ఐఎన్టీయుసి గత కార్యవర్గం ప్లీనరీలో ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ మధ్య సంబంధాలు నెలకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కలిసికట్టుగా కృషి చేయాలని తీర్మానం చేశారని. ఈ తీర్మానాన్ని గత సర్వ సభ్య సమావేశం ఆమోదించడం కూడా జరిగిందని.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ
ఐఎన్టీయుసి సభ్యులకు అసెంబ్లీ, లోక్‌సభ మరియు ఇతర స్థానిక సంస్థల్లో తగిన ప్రాతినిధ్యం మరియు కోటాలు ఇస్తామని మన ప్రియతమ నాయకుడు గత సర్వసభ్య సమావేశంలో 10,000 మంది ప్రతినిధుల ముందు వ్యక్తం చేశారని,ఇట్టి విషయాల్ని పరిగణన లోకి తీసుకొని మీరు దయచేసి అవసరమైన మార్గదర్శకాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు మరియు ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ ఫోరమ్‌లకు అందించాలని కోరారు.దీనికి మల్లికార్జున ఖర్గే సుముఖత వ్యక్తం చేయడం పట్ల సంతోషంగా ఉందని, కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు పార్టీ, యూనియన్ బలోపేతం కోసం పని చేయాలని కష్ట పడ్డ వారికి సముచిత స్థానం తప్పక ఉంటుందని జనక్ ప్రసాద్ తెలిపారు.ఖర్ ను కలిసిన వారిలో సెంట్రల్ జనరల్ సెక్రెటరీ కాంపెల్లి సమ్మయ్య , శంకర్రావు , నరేందర్ , శ్యామ్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు .