పెద్దఅడిషర్లపల్లి ఏప్రిల్15(జనంసాక్షి)జనంసాక్షి:తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన పెరుమళ్ళ వినోద్ కుమార్ అంబేద్కర్ జయంతి నిర్వహణ కమిటీ అధ్యక్షులు జంగ శ్రీనివాస్ మరియు ఉపాధ్యక్షులు బోలుమాల శ్యామ్ కుమార్ మరియు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి గారి చేతుల మీదుగా దళిత రత్న అవార్డు అందుకోవడం జరిగింది. అనంతరం వినోద్ మాట్లాడుతూ నేను చేసిన ప్రజా సేవలకు గాను ఈ అవార్డు రావడం సంతోషం కలిగించిందని మరియు ఈ అవార్డు ద్వారా నాకు ఇంకా సమాజంలోని ప్రజల పట్ల బాధ్యత పెరిగిందన్నారు. తనకు ఈ అవార్డు వచ్చేందుకు కృషిచేసిన మాల మహానాడు నాయకులకు మరియు దేవరకొండ డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పెరుమాళ్ళ వినోద్ ను దళిత నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు మహిళా అధ్యక్షులు గాజుల పున్నమ,నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ మరియు దేవరకొండ డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్, భోగరి రాంబాబు, కమల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.




