వేమనపల్లి,ఏప్రిల్ 10,(జనంసాక్షి) వేమనపల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను తహశీల్దార్ రాజుకుమార్,వైస్ ఎంపీపీ ఆత్రం గణపతి, వేమనపల్లి సర్పంచ్ కుబిడే మధుకర్,నీల్వాయి సర్పంచ్ గాలి మధు,ముల్కలపేట్ సర్పంచ్ బిడ్డల రాజలింగు,దస్నాపూర్ సర్పంచ్ తాటిపాముల రాజేశ్వరి,బెల్లంపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లింగగౌడ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతగానో ఆసరాగా నిలుస్తుందన్నారు.ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను ప్రవేశ పెట్టారన్నారు.పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు.




