టేకులపల్లి, ఏప్రిల్ 10 (జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని సాయన్నపేట గ్రామానికి ఇల్లందు ఆర్ & బి రోడ్ నుండి రు.70 లక్షల అంచనా తో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బోడు రోడ్డులో తుమ్మల చిలక స్టేజి నుండి తుమ్మల చిలక గ్రామం వరకు రు.1 కోటి70 లక్షల వ్యయంతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు.




