Wednesday, 4 November 2026

8వ రోజుకు చేరుకున్న వీవోఏల సమ్మె.

 

 

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 10, (జనంసాక్షి )బెల్లంపల్లి నియోజకవర్గం ఐకేపీలో పనిచేసే వీవోఏల సమ్మె సోమవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. సోమవారం నియోజకవర్గం వ్యాప్తంగా వీవోఏలు తహసీల్దార్, ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందజేసి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఐకేపీలో పనిచేసే వీవోఏలు పాల్గొన్నారు.