Tuesday, 3 November 2026

కళ్ళకు గంతలు కట్టుకొని ఐకెపి వివోఏల నిరసన

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఐకెపి వివో ఏ లను సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని ,ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, ప్రతినెలా వేతనాలు వివోఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని డిమాండ్లతో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిరవధిక సమ్మెలో ఐకెపి వివో ఏలు పాల్గొని మంగళవారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు. తమ సమస్యలను అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి వివో ఏలు అందరూ నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పొదుపు సంఘాలను నడిపించడంలో కీలక పాత్ర వహిస్తున్న వివో ఏ లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని తెలంగాణ ఐకెపి వివో ఏ ఉద్యోగుల సంఘం( సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి జ్యోతి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ చిప్ప కుర్తి అరవింద్ సంఘం ,జిల్లా అధ్యక్షురాలు రాజశ్రీ ,మండల అధ్యక్ష కార్యదర్శులు చొప్పరి ప్రేమలత ,ఉప్పరి శివ లీల, రజిత ,మేఘమాల, సిహెచ్ జ్యోతి,సుమలత ,శారద,దేవిక, లక్ష్మి వివో ఏలు పాల్గొన్నారు.