Tuesday, 3 November 2026

పేదల ఆరోగ్య భద్రతకు భరోసా సీఎం సహాయనిధి

 

 

 

 

హుజూర్ నగర్ మే 2 (జనం సాక్షి): పేదల ఆరోగ్య భద్రతకు భరోసా సీఎం సహాయనిధి అని బూరుగడ్డ సర్పంచ్ షేక్ సలీమారంజాన్ అన్నారు. హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో బూరుగడ్డ గ్రామానికి చెందిన ఏపూరి వీరమ్మ 36,000, మేకపోతుల వీరమ్మ 43,000, అమరబోయిన లింగమ్మ 10,000, ప్రార్థనబోయిన సైదమ్మ 14,000,జొన్నలగడ్డ నాగమణి 60,000, మెండం లింగమ్మ 20,000, ముదిగొండ సైదమ్మ 18,000 లు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ షేక్. సలీమారంజాన్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరంలా మారిందన్నారు. అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని పేదల ఆరోగ్యం పాలిట సంజీవనిలా సీఎం సహాయ నిధి పథకం తోడ్పాటును ఇస్తున్నదని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు కృషి చేస్తున్నదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గండు సైదులు, షేక్. అలీమ్ పాషా, ఆవుల వెంకటయ్య, గండు చిన్న సైదులు, చిమట సైదులు, తాళ్ల వెంకన్న, నందిగామ రాములు, మాడుగుల కనకయ్య, బత్తిని నాగరాజు, వట్టెపు మధు, కాంపాటి శీను, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.