Thursday, 5 November 2026

కవి సమ్మేళనం ను విజయవంతం చేయాలి. కలెక్టర్ అనురాగ్ జయంతి

 

రాజన్నసిరిసిల్ల బ్యూరో.జూన్ 08 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 11 న నిర్వహించనున్నకవి సమ్మేళనంను విజయవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. శుక్రవారం తెలంగాణ సాహిత్య దినోత్సవ కవి సమ్మేళనం ప్రచార పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, సిపిఓ పిబి చారి తో కలిసి కలెక్టరేట్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ” తెలంగాణ అస్తిత్వo, తెలంగాణ ప్రగతి ” కవితాంశం తో కవి సమ్మేళనం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో కవి సమ్మేళనం ఉదయం 10.00 గంటల నుండి నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే ఈ అంశం పై కవితలను ఆహ్వానించగా జిల్లా వ్యాప్తంగా 40 కి పైగా కవితలు వచ్చాయనికలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.కవి సమ్మేళనం లో కవిత పఠనం చేసిన కవులను ఈ కార్యక్రమంలో సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. కవితలు పంపిన కవులతో పాటు సాహిత్య అభిమానులు,ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.