Thursday, 5 November 2026

నల్ల బంగారం గని లో మెరిసిన కార్మిక నాయకుడు ..అనుక్షణం సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసమే పోరాటం .

 

 

 

 

 

 

 

 

;-మామూలు సింగరేణి ఉద్యోగి నుంచి కార్మిక అగ్ర నాయకునిగా ఎదిగిన మిర్యాల ..
కార్మిక క్షేత్రం నుంచి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రానున్నారా ? రామగుండం శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తారా …?

;-సామాన్య రైతు కుటుంబం లో జన్మించి కార్మిక నాయకునిగా ఎదిగిన . ప్రస్తుత టి. బి .జి .కె ఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి పై జనం సాక్షి ప్రత్యేక కథనం

మంచిర్యాల బ్యూరో జూన్ 8 (జనం సాక్షి ): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామం సామాన్య రైతు కుటుంబం లో చంద్ర రెడ్డి , అమృతమ్మ ల కు 1964 లో జన్మించారు , అయిదవ తరగతి వరకు రాణాపూర్ లో ని ప్రాథమిక పాఠశాలలో . పదవ తరగతి , ఇంటర్ పెద్దపల్లి లో విద్యనభ్యసించారు ఉన్నత చదువులకై కరీంనగర్ లో శ్రీ రాజా రాజేశ్వరి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ , బి ఎడ్ . ఒస్మానియా యూనివర్సిటీ , ఎం ఎడ్ . రాజమండ్రి ఎం ఏ సోషలజి కరెస్పాండెన్స్ లో పూర్తి చేశారు .

ఉద్యోగ ప్రస్థానం : 1989 వ సంవత్సరం లో సింగరేణి నిర్వహించిన క్లరికల్ పరిక్షలో సుమారు ముప్పై అయిదు వేల మంది పరిక్షకి హాజరుకాగా అందులో 16 ర్యాకు సాధించి సింగరేణి లో క్లరికల్ ఉద్యోగం సాధించారు . ఉద్యోగం లో చేరిన కొంత కాలం లోనే మంచి గుర్తింపు సాధించారు . 1992 లో సింగరేణి అల్ అసోసియేషన్ జాయింట్ ఆక్షన్ కమిటీ(SAJAC ) అనుబంధ సంస్థ అయినా సింగరేణి క్లరికల్ అసోసియేషన్( SICCA ) లో కార్మిక నాయకునిగా ఎదిగారు . కార్మికులకు అండగా నిలిచారు .
కార్మిక నాయకునికునిగా : 1998 లో మొదటి సారి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగినప్పుడు IFTU & AIFTU ట్రేడ్ యూనియన్ తరుపున నూనె కొమురయ్య , కెంగర్ల మల్లయ్య , ఆర్ జి 1 & ఆర్ జి 2 నుండి ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికలప్పుడు మిర్యాల రాజి రెడ్డి పనితీరును గమనించిన నాయకులు . యూనియన్ లో పలు బాధ్యతలను అప్పగించారు ఉద్యమం లో పనిచేస్తున్న నూనె కొమురయ్య , కెంగర్ల మల్లయ్య ను పోలీస్ లు నిర్బందించిన సమయం లో మిర్యాల కీలక పాత్ర పోషిచి గుర్తింపు సంఘానికి తోడ్పాటు అందించారు . 2002 లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న నేపథ్యం లో ఆర్ జి 2 గని లో మంచి ప్రాబల్యం ఉన్న వ్యక్తి గ మిర్యాల రాజి రెడ్డి ని అతని నాయకత్వ లక్షణాలు గుర్తించిన , నాయకులూ , కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఆద్వర్యం లో తెరాస పార్టీ లోకి కె . సి . ఆర్ సమక్షం లో పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు . సింగరేణి లో జాతీయ సంఘాలే కాకుండా తెరాస పార్టీ తరుపున సింగరేణి కూడా మనకంటూ ప్రత్యేక సంఘం ఏర్పాటు చేయాలన్న కమిటీ లో కీలకంగా వ్యవహరించారు . అప్పుడే సింగరేణి లో టి. బి .జి .కె ఎస్ పార్టీకి ఆవిర్భావ ఏర్పాట్లు జరిగాయి .
2002 పల్లె బాట కార్యక్రమం లో మంథని నియోజక వర్గం లో అనంత రెడ్డి , లక్ష్మి కాంతం , డా,, సులోచన లో తో కలిసి మిర్యాల రాజి రెడ్డి ప్రజల్లో తెలంగాణ ఉద్యమం గురించి అవగాహనా , చైతన్యం కల్పించడం లో ప్రధాన పాత్ర పోషించారు .
2003 వ సంవత్సరం జనవరి 27 లో ప్రొఫెషర్ జయశంకర్ చేతుల మీదుగా గోదావరిఖని లో టి. బి .జి .కె ఎస్ పార్టీ గా ఆవిర్భవించింది. గోదావరిఖని 7 LEP ప్రమాదం లో పదిహేడు మంది కార్మికులు జల సమాధి అయ్యారు . అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి కార్మికులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా నే వెళ్లిపోయారు . కార్మికులు కార్మిక నాయకులూ ముఖ్య మంత్రి కాన్వాయ్ పై రాళ్ళూ విసిరారు . కార్మిక నాయకులైన కొప్పుల ఈశ్వర్ ,మిర్యాల రాజి రెడ్డి లను జైలు కి పంపారు . ఎంతటికి నాయకుల పోరాటం ఆపకపోయేసరికి . విధిలేని పరిస్థితుల్లో చని పోయిన కుటుంబాలకు ఆరు లక్షల నష్టపరిహారం అందించారు . ఈ విజయం తో టి. బి .జి .కె ఎస్ కి మిర్యాల రాజి రెడ్డి కి ప్రశంశల జల్లు కురిసింది .
2003 కె. సి. ఆర్ తలపెట్టిన ఢిల్లీ యాత్ర హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు సుమో వాహనం లో కార్యకర్త లోతో వెళ్లిన ఏకైక కార్మిక నాయకునిగా గుర్తింపు పొందారు . 2004 లో మొదటి సారిగా టి. బి .జి .కె ఎస్ సింగరేణి ఎన్నికల్లో పోటీ చేసి నాలుగు డివిజన్లలో విజయం సాధించింది . గోదావరిఖని లో విజయకేతనం ఎగరవేసింది . పి.టి స్వామి మొదటి అధ్యక్షునిగా , మొదటి ఉపాధ్యక్షునిగా మిర్యాల రాజి రెడ్డి ఎన్నికయ్యారు . అధికార కార్మిక నాయకునిగా మిర్యాల స్థానాన్ని కైవసం చేసుకున్నారు . 2007 లో జరిగిన ఎన్నికల్లో మిర్యాల మరల ఉపాధ్యక్ష పదవిని కొనసాగించారు . 2012 జరిగిన ఎన్నికల్లో అయిదు డివిజన్లలో విజయం సాధించి గుర్తింపు సంఘంగా టి. బి .జి .కె ఎస్ ఆవిర్భవించింది . మిర్యాల రాజిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు .
ఉద్యమ నేపథ్యం : ఇంటర్ విద్యాబ్యాసం నుంచే రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో పలు కీలక పదవులు పోషించారు . ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిన మిర్యాల రాజి రెడ్డి చిన్నతనం నుంచి ప్రజల కష్టాలు చూసి . సమాజానికి తనవంతు భాద్యత నిర్వహించాలని అనుకున్నారు
.
తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన మిర్యాల రాజి రెడ్డి కార్మికుల ఆవేదనలు , శ్రమ దోపిడీని . ఆంధ్ర పెత్తనం, తెలంగాణ కార్మికుల అణిచివేత ల నుండి కాపాడాలని ఉద్యమం లో చేరారు .సింగరేణి లో జరిగే అన్యాయాలను అరికట్టాలని తెలంగాణ కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించుకుని . జాతీయ సంఘాన్ని సైతం ఎదిరించారు . తెలంగాణ సాధిస్తే తెలంగాణ కార్మికులకు ఆంధ్ర పెత్తనం నుండి విముక్తి కలుగుతుందని , మన హక్కులు మనకే ఉంటాయని , మన స్వేచ్ఛను ఎవరు హరించలేరని కార్మికుల్లో చైతన్యం కలిగించారు . జాతీయ సంఘాల పెత్తనాలు నచ్చక , తెలంగాణాలో మనకంటూ ప్రత్యేక సంఘం ఉండాలని సి. కా .స తరుపున ప్రభుత్వాన్ని కోరారు .
తొలి దశ తెలంగాణ ఉద్యమం లో జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ కోదండ రామ్ ఇచ్చిన ముప్పై అయిదు రోజుల సకల జనుల సమ్మెను సింగరేణి కార్మికులతో విజయవంతం చేసి తెలంగాణ ప్రజల మన్ననలు పొందారు . అలుగునూరు లో కేసీఆర్ ని అరెస్ట్ కి నిరసనగా కార్మికుల సహకారం తో ఏడూ రోజులు బందు నిర్వహించారు . శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు
ఉమ్మడి రాష్ట్రం లో ఆంద్ర అధికారుల పెత్తనాలు , దోపిడీ విధానాలు , వివరించి ఆంధ్ర నుండి విముక్తి కావాలని , దొర బాంచన్ పదాలు తీసివేసి కార్మికుల ఆత్మ గౌరవం మన సంస్కృతి కాపాడాలని . కమిటీ కి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు
వేలమంది కార్మికులను తెలంగాణ ఉద్యమం వైపు చూసేలా చైతన్య పరిచారు .

వివాహం : చిన్నతనం నుంచి విప్లవ భావ జాలం కలిగిన మిర్యాల రాజి రెడ్డి ర్యాడికల్ స్టూడెంట్ యూనియన్ విద్యార్ధి నాయకునిగా ఉన్నప్పుడే కుల రహిత సమాజం కోసం , వరకట్న ఆచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు . పలువురికి ఆదర్శ౦గా ఉండాలని సంప్రదాయ పద్దితి లో కాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయం లో 1990 వ సంవత్సరం లో నాగరాజు కుమారి ని ప్రేమ వివాహం చేసుకున్నారు .

రాజకీయ నేపథ్యం : రామగుండము నియోజక వర్గం లో అధిక శాతం కార్మిక వర్గాలు , FCI , RFCL , NTPC కిశోరం సిమెంట్ కర్మాగారం కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు , రామగుండం నియోజక వర్గం లోని పాలకుర్తి సొంత మండలం కావడం . మూడు దశాబ్దాలకు పైగా కార్మికులకు చేస్తున్న నిస్వార్థ సేవలు , ఎవరికీ కష్టం వచ్చిన అనునిత్యం అందుబాటులో ఉండటం . నియోజక వర్గ ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడం . ప్రగతి విద్య సంస్థ కళాశాలలు కలిగి ఉండటం కలిసి వచ్చే అంశాలు
టి . బి .జి .కె ఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి మాట్లాడుతూ : సామాన్య రైతు కుటుంబం మాది విద్యార్ధి దశ నుంచే రాడికల్ స్టూడెంట్ యూనియన్ నాయకుని గా పని చేయడం తో . కార్మికుల కష్టాలు కళ్లారా చూశాను , సింగరేణి ఉద్యోగం లో చేరిన కొన్ని నెలల్లోనే కార్మికుల పైన జాతీయ సంఘాల పెత్తనం , ఆంద్ర అధికారుల అరాచకాలు చూసి చలించి పోయాను , తెలంగాణ కార్మికులకు అండగా నిలబడాలని యూనియన్ లో చేరాను . కార్మికులకు యూనియన్లకు కు చేసిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా టి . బి .జి .కె ఎస్ ప్రధాన కార్యదర్శి గా కార్మికులు , నాయకులూ నన్ను ఆశీర్వదించారు . నాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను . ప్రభుత్వం కార్మికులకు నేను చేసిన సేవలను గుర్తించి రామగుండం శాశన శభ అభ్యర్థిగా అవకాశం కలిపిస్తే . కార్మికులకు . ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం అదృష్టం కలుగుతుందని భావిస్తున్నాను ,