కష్టకాలంలో అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్.
కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్.
సిరిసిల్ల. జనవరి 6. (జనం సాక్షి). కష్టకాలంలో నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని 34 వ వార్డు కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ అన్నారు. శుక్రవారం వార్డులోని పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టకాలంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.




