Wednesday, 4 November 2026

టీయూడబ్ల్యూజే హెచ్ -143 మండల కమిటీ ఎన్నిక

టీయూడబ్ల్యూజే హెచ్ -143 మండల కమిటీ ఎన్నిక

తిరుమలగిరి (సాగర్) :
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ – 143 (TUWJ H – 143) మండల కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జయశంకర్ ఆదేశాల మేరకు శుక్రవారం నియోజకవర్గ పరిశీలకు డు మనాది రవీందర్ ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా నంది బిక్షం ప్రధాన కార్యదర్శిగా షేక్ అబ్దుల్లా లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన జిల్లా,నియోజకవర్గ, మండల పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు.మండల ఉపాధ్యక్షులుగా కటికర్ల మల్లయ్య,కోశాధికారిగా ఇరిగి నాగయ్య,కార్యవర్గ సభ్యులుగా ఎడవల్లి గురువయ్య,నల్లబోతు వెంకటేశ్వర్లు,మెగావత్ చత్రు నాయక్,చవ్వ మోహన కృష్ణారెడ్డి లను ఎన్నుకున్నారు