Wednesday, 4 November 2026

కసబ్‌ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటాం భారతీయులే లక్ష్యంగా దాడులు: తాలిబన్లు

ఇస్లామాబాద్‌, నవంబర్‌ 22):ఉగ్రవాది మహమ్మద్‌ అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీయడంపై తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. కసబ్‌ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామని గురువారం హెచ్చరించారు. భారతీయులే లక్ష్యంగా దాడులకు పాల్పడతామని తెలిపారు. 2008 నవంబర్‌ 26న ముంబైపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో సజీవంగా పట్టుబడిన కసబ్‌ను కోర్టు ఆదేశాల మేరకు బుధవారం అత్యంత రహస్యంగా పుణెలోని ఎరవాడ జైలులో ఉరి తీశారు. ఈ నేపథ్యంలో.. తాలిబన్లు భారత్‌కు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ‘అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీసినందకు భారతీయులను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించాం’ అని తాలిబన్ల అధికార ప్రతినిధి ఎహసానుల్లా ఎహసాన్‌ ప్రకటించారు. గురువారం గుర్తు తెలియని ప్రాంతం నుంచి విూడియాకు ఫోన్‌

చేసిన ఎహసాన్‌.. కసబ్‌ మృతదేమాన్ని అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ‘కసబ్‌ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు లేదా మాకు అప్పించాలి. లేకుంటే.. భారతీయులను హతమార్చి.. వారి మృతదేహాలను కూడా అప్పగించబోమని’ తెలిపారు. ఇకనుంచి భారతీయులే లక్ష్యంగా ఎక్కడైనా దాడి చేస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు అత్యంత సన్నిహితంగా మెలిగే తాలిబన్లు పాకిస్తాన్‌లో చాలారోజులగా మారణ¬మం సృష్టిస్తున్నారు. ఆత్మాహుతి దళాలతో రెచ్చిపోతున్నారు. అయితే, ఇంతవరకు విదేశాల్లో వారి ఉనికి పెద్దగా కనిపించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *