కస్టమర్ల ఆదరణతోనే వ్యాపార అభివృద్ధి
– సూర్యాపేట ఎంవీఐ వెంకటయ్య
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కస్టమర్ల ఆదరణతోనే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని సూర్యాపేట ఎంవీఐ వెంకటయ్య అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటలక్ష్మి హీరో షోరూంలో హీరో గ్లామర్ ఓల్డ్ మోడల్ అదే లుక్ అదే స్టయిల్ బైక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా హీరో షోరూం యజమాని రాచర్ల కమలాకర్ తో కలిసి హీరో గ్లామర్ ఓల్డ్ మోడల్ 125సీసీ వాహనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.అనంతరం శ్రీ వెంకటలక్ష్మి హీరో షోరూం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాచర్ల కమలాకర్ మాట్లాడుతూ ప్రపంచపు నంబర్ వన్ హీరో కంపెనీ ద్వి చక్ర వాహనాల అమ్మకాలలో కస్టమర్ల ఆదరణ, నమ్మకంతోనే 23 ఏళ్ల నుండి అగ్రస్ధాయిలో నిలిచిందన్నారు.హీరో కంపెనీ కస్టమర్లకు నమ్మకం, నాణ్యత, సేవలో అగ్రభాగాన ఉంటూ కాలంతో మారుతున్న నూతన టెక్నాలజీతో యువతకు నచ్చే విధంగా నూతన , కాలుష్య రహిత బైకులను అందిస్తూ ప్రజాదరణతో అమ్మకాలలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. శ్రావణ శుక్రవారం, హీరో షోరూం ఆవిర్భావ దినోత్సవం, 8వ వార్షికోత్సవం సందర్భంగా ఒకే రోజు 30 గ్లామర్ వాహనాలను వాహనదారులు కొనుగోలు చేశారు.ఈ కార్యక్రమంలో ఐడిబిఐ బ్యాంకు మేనేజర్ అజిత్ వర్మ, మేనేజర్ సుధీర్, వర్క్ మేనేజర్ నాగేందర్, పట్టణంలోని బైక్ మెకానిక్స్ , ఫైనాన్స్ సిబ్బంది, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.