హుజూర్ నగర్ ఏప్రిల్ 28 (జనంసాక్షి): పట్టణంలోని 13వ వార్డ్ (అంబేద్కర్ కాలనీ) కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కస్తాల వీరయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని హుజూర్ నగర్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని కస్తాల వీరయ్య ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీరయ్య బౌతిక కాయం పై పూలమాలలు ఉంచి కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పడం జరిగిందన్నారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, రైల్వే జోనల్ మెంబర్ తెలంగాణ రాష్ట్ర ఐ ఎన్ టి యు సి నాయకులు యరగాని నాగన్న, 13వ వార్డ్ కౌన్సిలర్ రాజా నాయక్, 14వ వార్డ్ అధ్యక్షులు కోల్లపూడి యోహాన్, 11వ వార్డ్ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి బంటు సైదులు, 18వ వార్డ్ అధ్యక్షులు జక్కుల మల్లయ్య, స్థానికులు ముత్తయ్య , బాబా, వసంత్, శోభన్ తదితరులు పాల్గొన్నారు.




