చేర్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 28 : చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలకు సంబంధించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఔట్ సోర్సింగ్ కార్యదర్శులు శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు మొదటిరోజు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా నాలుగు సంవత్సరాల సర్వీసు కాలంగా పరిగణిస్తూ ఓపీఎస్, జెపీఎస్ లను వెంటనే రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా కోశాధికారి రాజు గౌడ్, సహాయ కార్యదర్శి మలుగ సతీష్, జిల్లా మహిళా కన్వీనర్ పల్లె రజిత, ఈసీ మేంబర్ ఏలూరి రాజు, మూడు మండలాల అధ్యక్ష కార్యదర్శులు పబోజు నరేష్ , బాసంగారి లోకేశ్వర్ రెడ్డి, పంచాక్షరి, రేణుక పాల్గొనగా వారి సమ్మెకు మద్దతుగా కొమురవేల్లి మండలం లెనిన్ నగర్ సర్పంచ్ సభితా-భాస్కర్, ఐనాపూర్ సర్పంచ్ చెరుకు రమణా రెడ్డి, చేర్యాల క్లస్టర్ సీనియర్ కార్యదర్శులు చిలుక కరుణాకర్, రాజమణి, వెంకటేశ్వర్లు, మధవ్ జాదవ్ మద్దతు తెలిపారు.




