:
శామీర్ పేట్, జనం సాక్షి :తూంకుంట మున్సిపల్ పరిధిలోని ఉప్పర్ పల్లి లో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, వార్డు అధ్యక్షులు బాబు ఆధ్వర్యంలో హాథ్ సే హాథ్ జోడోయాత్ర
జోడోయాత్రకు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై
గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వివరించారు.
బి ఆర్ యస్,బిజేపీ పార్టీల పట్ల విసిగిపోయిన ప్రజలు తమ సమస్యల్ని,గోడును కాంగ్రెస్ నాయకుల ముందు వెళ్ళబోసుకున్నారు.
గ్రామంలో ఇంటింటికి తిరిగిన నాయకులు మల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని,ప్రజలను గాలికొదిలేసి, భూములను దోచుకోవడానికే నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడని,ప్రజలను పట్టించుకోని మల్లారెడ్డిని,బి ఆర్ యస్ ప్రభుత్వాన్ని పాతాళంలోకి పంపించాలని,ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటినిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని,గృహ వినియోగ సిలిండర్ 500 లకే రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన అవసరం ఉందని,నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి రావాలని అందుకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ జోడోయాత్ర లో హరివర్ధన్ రెడ్డి గారితో పాటు నియోజకవర్గ బి బ్లాక్ అద్యక్షులు వేముల మహేష్ గౌడ్,శామీర్ పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ గౌడ్,ఓబిసి సెల్,సేవాదళ్ జిల్లా అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్,మొహమ్మద్ షఫీయుద్దీన్,టిపిసిసి మహిళా కార్యదర్శి పాలడుగుల పద్మ,మూడు చింతలపల్లి మండల వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్,ఎస్టీ సెల్ అధ్యక్షులు బండ్లగూడ నాగేష్ గౌడ్,నానావత్ సురేష్ నాయక్,శామీర్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తుంకి బిక్షపతి,తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మురళి గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ధర్మారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లేష్ గౌడ్,నర్సింగ్ రావు,ఉప్పరపల్లి 2 వ వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాను,యూత్ కాంగ్రెస్ నాయకులు దయాకర్,రాకేష్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు భరత్ రెడ్డి,నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
28ఎస్పీటీ -1: ప్రజల సమస్య లు తెల్సుకుంటున్న నాయకులు




