మునగాల రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
మునగాల, నవంబర్ 22(జనంసాక్షి): మునగాల మండల కేంద్రంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత దురదృష్టకరమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో వాసవి భవన్లో నిర్వహించిన సమావేశంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరగటం అత్యంత దురదృష్టకమని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన లోటు ఎవరు తీర్చలేనిది అన్నారు. మృతుల కుటుంబాలకు క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వంతో మాట్లాడి సహకారం అందిస్తానన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగం, చదువుతున్న పిల్లలకు గురుకుల పాఠశాలలో సీట్లు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఈ విధంగా ఏదో రకమైన ప్రభుత్వ సహాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులకు కుటుంబాల ఆర్థిక సహాయం గురించి అప్రమత్తం చేశారు. మునగాలలో సర్వీస్ రోడ్డు సమస్యను కూడా ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీవో కిషోర్ కుమార్ లను మృతుల, క్షతగాత్రుల బాధిత కుటుంబాలపై సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అందజేసిన రెండు లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీవో కిషోర్ కుమార్, జడ్పిటిసి నల్లపాటి ప్రమీల శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, సొసైటీ చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, సీతారాములు, స్థానిక సర్పంచ్ చింతకాయల ఉపేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు ఉడుం కృష్ణ, సీనియర్ నాయకులు యుగంధర్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ నాగరాజు, మండల అధికార ప్రతినిధి ఎల్పి రామయ్య, నాగిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




