కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం – జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్
యాదాద్రి భువనగిరి జిల్లా :
బొమ్మలరామారం మండలం లోని మల్యాల గ్రామం లో రెండు కోట్ల ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల భవనాన్ని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి.. ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యా చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు గురువులు చెప్పిన విద్యనభ్యసించి మీ తల్లిదండ్రులు మీ పై పెట్టుకున్న ఆశయాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా ఎదగాలని కోరారు.విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి వెళ్లేలా తీర్చిదిద్దే బాధ్యత కూడా ఉపాధ్యాయులపై కూడా వుంద న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, తహసిల్దార్ పద్మ సుందరి, ఎంపీడీవో సరిత, మండల ఎంఈఓ కృష్ణ, ఎంపీపీ సుధీర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గొడుగు శోభా చంద్రమౌళి,మండల పార్టీ అధ్యక్షులు పోలా గాని వెంకటేష్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ గూదే బాలనరసయ్య, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుశంగుల
సత్యనారాయణ, సర్పంచులు, ఎంపిటిసిలు, సింగిల్ విండో డైరెక్టర్లు,ఉప సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు కొండోజు ఆంజనేయులు,
పోశంరెడ్డి,కృష్ణారెడ్డి,రామిడి రాంరెడ్డి,మల్లారెడ్డి,ఈశ్వర్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్, బోనంకుర మల్లేష్, మైలారం రామకృష్ణ, శ్రీకాంత్ గౌడ్, బుడుమ వెంకటేష్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




