Saturday, 7 November 2026

వార్షిక తనిఖీలో కోటగిరి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన బోధన్ ఏసిపి కిరణ్ కుమార్

వార్షిక తనిఖీలో కోటగిరి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన బోధన్ ఏసిపి కిరణ్ కుమార్.

కోటగిరి డిసెంబర్ 26 జనం సాక్షి:-వార్షిక తనిఖీల్లో భాగంగా బోధన్ డివిజన్ ఏసిపి కిరణ్ కుమార్ కోటగిరి పోలీస్ స్టేషన్ ని సోమవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా ముందుగా సిబ్బంది నుండి ఆయన గౌరవ వందన స్వీకరించారు.తదనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి,స్టేషన్ ఆవరణంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్లో నిర్వహిస్తు న్న పలు రికార్డులు,ఫైళ్లను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఏసిపి కిరణ్ కుమార్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేస్తూ క్రమశిక్షణతో ప్రజలకు జవాబు దారీగా ఉండాలన్నారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది,ఎసై మచ్చెందర్ రెడ్డిల పనితీరుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఈ తనిఖీలో ఆయన వెంట ఎసై మచ్చెందర్ రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, కానిస్టేబుల్స్ సురేష్,ప్రవీణ్, పోశెట్టి,ప్రశాంత్,సంతోష్,వెంకటేశ్వర్ రెడ్డి,బాకర్,ఉమెన్ ధనశ్రీ ఉన్నారు.